Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో మూడు రోజులుగా ముసురు వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండ వర్షం కురుస్తోంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే బుధవారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. గురువారం సైతం ఉదయం నుంచే ఎడతెరిపిలేకుండ కురుస్తోంది. గ్రేటర్లో సైదాబాద్, కాప్రా, మాదాపూర్, మియాపూర్, బీహెచ్ఈఎల్, చార్మినార్, మలక్‌పేట్, ఆసిఫ్‌నగర్, చందులాల్ బరాదారి, రామచంద్రాపురం, షేక్‌పేట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, ఖాజాగుడ, రాయదుర్గం, బాలానగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, శ్రీనగర్‌కాలనీ, చందానగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మారేడ్‌పల్లి, జియాగుడ, అమీర్‌పేట్, జీడిమెట్ల, గండిపేట్, బోరబండ, బేగంబజార్, కార్వాన్, వెంకటేశ్వరకాలనీ, షాపూర్‌నగర్, కాప్రా, రెయిన్‌బజార్, అలియాబాద్, మోండామార్కెట్, జహనుమా, మెహిదీపట్నం, కాంచన్‌బాగ్, విజయనగర్‌కాలనీ, ముషిరాబాద్, బేగంపేట్, సరూర్‌నగర్, లంగర్‌హౌస్, ఉప్పల్, తిరుమలగిరి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, సైదాబాద్, హయత్‌నగర్, సికింద్రాబాద్, అల్కాపురికాలనీ, జూబ్లీహిల్స్, ఏఎస్‌రావునగర్, హిమాయత్‌నగర్, బార్కాస్ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండ వర్షం కురిసింది.
274 ఫిర్యాదులు
వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీకి 274ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 239ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. మరో 35 ఫిర్యాదులు పురోగతిలో ఉన్నాయి. రోడ్ల మరమత్తులు 43, నీళ్లు నిల్వడం 39, మ్యాన్హౌల్ కవర్ 10, డ్రెయినేజీ ఓవర్ ఫ్లో 92, నాలా ఓవర్ ఫ్లో 46, చెట్లు విరగడం 27 వంటి వాటిపై ఫిర్యాదులు అందాయి.
ఏరియా వర్షంపాతం(సెం.మీ)
సైదాబాద్ 2.3
మాదాపూర్ 2.2
ఆర్సీపురం 2
ఆసిఫ్‌నగర్ 1.9
గచ్చిబౌలి 1.9
చందానగర్ 1.7
ఖైరతాబాద్ 1.7