Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 వేల మెట్రిక్ టన్నుల నుంచి
- 6 వేలకుపైగా మెట్రిక్ టన్నులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరంలో కోటికిపైగా జనాభా ఉంది. సుమారు 25లక్షల ఇండ్లు ఉంటాయని అంచనా. జనాభాతోపాటు చెత్త ఉత్పత్తి కూడ పెరుగుతోంది. 2014లో 4వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయితే ఈ రోజుకు 6వేల మెట్రిక్ టన్నులకుపైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే చెత్త పెరుగుతుందా? లెక్కల్లో గోల్మాల్ జరుగుతుందా? అంటూ పలువురు ప్రజా సంఘాలు, జీహెచ్ఎంసీ యూనియన్ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
గ్రేటర్లో..
జీహెచ్ఎంసీి పరిధిలో రోజురోజుకు చెత్త ఉత్పత్తి పెరుగుతోంది. 2014లో 4,000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నదని అధికారులు ప్రకటించారు. 20జులై2021న 7,308మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయిందని అధికారులు వెల్లడించారు. 2009లో రాంకీ, జీహెచ్ఎంసీ ఒప్పందంలో భాగంగా చెత్త సేకరణ(40శాతం), రవాణా(20శాతం), ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్టు(40శాతం) కలిపి మెట్రిక్ టన్ను చెత్తకు రూ.1,475 చొప్పున రాంకీ సంస్థకు చెల్లించాలని నిర్ణయించారు. కానీ చెత్త సేకరణ, రవాణా బాధ్యతలను రాంకీకి అప్పగించలేదు. ఘనవ్యర్థపదార్ధాల నిర్వహణ ప్రాజెక్టును మాత్రమే అప్పగించారు. అయితే 2014లో మెట్రిక్ టన్నుకు రూ.590 చొప్పున నెలకు రూ.7.08 కోట్లు రాంకీకి జీహెచ్ఎంసీ చెల్లించింది. 2021లెక్కల ప్రకారం రాంకీ సంస్థకు జీహెచ్ఎంసీ సుమారు రూ.10కోట్లకుపైగా చెల్లిస్తోందని అంచనా. జులై 1వ తేదిన 6,241 మెట్రిక్ టన్నులు, 2న 6,740, 3న 6,884, 4న 6,825, 5న 6,727, 6న 6,901, 7న 6,910, 8న 9న 7,063, 10న 7,019, 11న 6,614, 12న 6,862, 13న 7,114, 14న 7,012, 15న 6,522, 16న 7,278, 17న 7,086, 18న 6,745, 19న 7,138, 20వ తేదిన 7,308మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అధికారులు ప్రకటించారు.
2,976 మెట్రిక్ టన్నుల జంతు వ్యర్థాలు
బక్రీద్ సందర్భంగా గ్రేటర్లో 2,976మెట్రిక్ టన్నుల జంతు కళేబరాలు పేరుకుపోయాయి. ఈనెల 21, 22 తేదీల్లో జంతు వ్యర్థాలను పారిశుధ్య కార్మికులు సేకరించారు.ఎల్బీనగర్ జోన్లో 30మెట్రిక్ టన్నులు, చార్మినార్ జోన్లో 1400మెట్రిక్ టన్నులు, ఖైరతాబాద్ జోన్లో 850మెట్రిక్ టన్నులు, శేరిలింగంపల్లి జోన్లో 349, కూకట్పల్లి జోన్లో 60, సికింద్రాబాద్ జోన్లో 287మెట్రిక్ టన్నుల జంతు వ్యర్థాలను సేకరించారు.