Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ రాధా రెడ్డి
నవతెలంగాణ - మలక్‌పేట్
చెట్లతోనే జీవరాశి మనుగడ ముడిపడి ఉంది అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత లు తీసుకోవాలి అని ఆర్కె పురం డివిజన్ కార్పొరేటర్ రాధా రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్కెపురం డివిజన్ హరిపురి కాలనీ రోడ్ నెంబర్-1 లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ధీరజ్రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహద పడుతాయి అన్నారు. బావితరాల వారికి మనం అందించే ఆస్తి ఏది అయినా ఉంది అంటే ఆరోగ్యకర మైన వాతావరణం అన్నారు. డివిజన్‌ను హరిత డివిజన్‌గా మార్చేందుకు ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, నాయకులు వెంకట్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, విజరు, స్వామి, కాలనీ వాసులు పాల్గొన్నారు.