Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఎంతో కాలంగా తెలంగాణ ప్రాంతంలో బోనాల వేడుకల్లో వినవచ్చే 'మాయ దారి మైసమ్మో మైసమ్మ'ను నత్య కళాకారులు జానపద శైలిలో నర్తించి విశేషంగా హాజరైన ప్రేక్షకులకు కన్నుల పండువ చేశారు. రవీంద్రభారతి వేదిక పై ఆదివారం భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏ.బీ.సీ. ఫౌండషన్ సంయుక్త అధ్యర్యంలో బోనాల జానపద జాతర ఆట, పాటలతో సందడిగా సాగింది.
ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి(ఢిల్లీ) డాక్టర్ సముద్రాల వేణు గోపాలాచారి, రాష్ట్ర పోలీస్ గహ నిర్మాణ సంస్థ చైర్మన్ కె.దామోదర్ గుప్తలు పాల్గొని మాట్లాడుతూ కారోన కష్ట కాలంలో యువత పిల్లలు చదువులతో పాటు, కళలకు దూరమైనారన్నారు. మానసిక ఆరోగ్యానికి, సమాజ ప్రశాంతతకు కళలు దోహదపడతాయి అన్నారు. తెలంగాణ సంస్కతికి ప్రతిబింబమైన బోనాలు వేడుకను రవీంద్రభారతిలో అట్టహాసం జరిపిన నిర్వాహకులు అభినందశనీయులు అన్నారు. ప్రముఖ కూచిపూడి నత్య కళాకారుడు ప్రశాంత్, సామాజిక కార్యకర్త స్వప్న సభలో పాల్గొన్నారు. నాట్య, సంగీత గురువులు ప్రవీణ్, అనూష, నరేంద్ర కుమార్, తరంగిణి, భవ్య శ్రీ, లక్ష్మి, అరుణ, రజని, వసుధ, శ్రీవాణి, శ్రీదేవి, సంగీత గురువు మాధవి లను సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు రమణారావు స్వాగతం పలుకగా భారత్ ఆర్ట్స్ అధ్యక్షురాలు లాలితారావు కార్యక్రమం నిర్వహించారు.