Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశుభ్రతను పట్టించుకోని బిల్డర్లు
- రోడ్లపైనే నిర్మాణ వ్యర్థాలు పడేస్తున్నా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-కూకట్ పల్లి
పరిశుభ్రత, పచ్చదనం, అభివృద్ధికోసం జీహెచ్ంఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి లక్ష్యానికి బిల్డర్లు, బడా కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. బిల్డింగులు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టిన సందర్భంగా అక్కడి నుంచి తరలించే వ్యర్థాలను తమకు నచ్చిన చోట, రోడ్లపై అడ్డంగా పోస్తూ ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పలుచోట్ల ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లపై అడ్డంగా నిర్మాణ వ్యర్థాలు కనిపించినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో చూసిన వారంతా ఇదేం పట్టణ ప్రగతి అని చర్చించుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, పట్టణ ప్రగతి ద్వారా పదిరోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరిలో మార్పురావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.