Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నాలా ఆక్రమణలపై అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి వాటిపై ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వద్దని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలొని గాజులరామారం సూరారంలో గల అర్బన్ ఫారెస్టు బ్లాక్‌లలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, వర్షపు నీటి నాలాల అభివృద్ధి తదితర అంశాలపై కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ మమత, టౌన్ ప్లానింగ్, యూబీడీ, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సూరారంలోని అర్బన్ ఫారెస్టు బ్లాక్‌లో మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెవాలన్నారు. ఆహ్లాదకర వాతావరణం తలపించేలా రూపుదిద్దుకుంటున్న అర్బన్ ఫారెస్టు బ్లాక్‌లలో సోలార్ పోల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. టీఎస్ఐఐసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న థీమ్ స్పోర్ట్స్ పార్కులో అన్ని పరికరాలతో వారంరోజుల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి కుత్బుల్లాపూర్ ప్రధాన రోడ్డు వెడల్పు పనులపై చర్యలు తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, గాజులరామారం డీసీ ప్రశాంతి, సిటీ ప్లానర్ ఉమాదేవి, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, ఈఈ కృష్ణ చైతన్య, డీఈలు శీరిష, రామ్చందర్రాజు, ఎలక్ట్రికల్ డీఈ రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.