Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కుమార్
నవతెలంగాణ-నారాయణగూడ
ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కుంభకోణంతో గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం బండారాన్ని ఆగస్టు1న నిర్వహించే బామ్ సెఫ్ ఆధ్వర్యంలో వర్చువల్, ఆన్లైన్ సమావేశాల్లో ప్రజలకు బహిర్గతం చేస్తామని బామ్ సెఫ్ (రాష్ట్రీయ మూలనివాసి సంఫ్‌ు) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుమార్ అన్నారు. ఆదివారం బషీర్ బాగ్‌లోని రాష్ట్ర కార్యాలయంలో బామ్ సెఫ్ 8వ తెలంగాణ రాష్ట్ర సంయుక్త సమావేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం భారతీయ ముక్తి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వలిగి ప్రభాకర్, బహుజన క్రాంతి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అంసోల్ లక్ష్మణ్ లతో కుమార్ కలిసి మాట్లాడుతూ పెగాసస్ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆరోపించారు. విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని, కుల సంఘాల ద్వారా కుల నిర్మూలన జరగదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బామ్ సెఫ్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ రవీంద్ర మాలి, ఉపాధ్యక్షులు ఇమ్యాన్యుయెల్, ఉత్తమ్ కాంబ్లే, మారుపాక భీమయ్య, అబ్దుల్ జమీల్, ప్రధాన కార్యదర్శులు ఈ.వెంకట కిషన్, డి.నరేందర్ తదితరులు పాల్గొన్నారు.