Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్రం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ డీవైఎఫ్ఐ కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం షాపూర్‌నగర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ల్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటనలు చేస్తుందన్నారు. స్థానికంగా ఉన్న వారికే పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను పెంచి పేదల ప్రజలపై భారం మోపుతుందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు అంజయ్య, మండల అధ్యక్షులు లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు పాషా, శ్రీను, మండల నాయకులు బాలు, కును, గన్‌శ్యామ్, జిసాన్ తదితరులు పాల్గొన్నారు.