Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సహారా ఎస్టేట్స్‌లో సీపీఐ(ఎం) స్థానిక శాఖ రెండో మహాసభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు అనిల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనలో సామాన్యులు, పేదలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, అభద్రతా భావానికి గురవుతున్నారని అన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. రైతులను కూలీలుగా మార్చే నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రజలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సహారా శాఖ సభ్యులు అందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పార్థసారథి, జిల్లా కోర్ కమిటీ సభ్యులు చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి, శాఖ కార్యదర్శి నోముల సుదర్శన్, జానీ, ప్రభాకర్, వెంకట్రావు, శాంతి కుమార్ పాల్గొన్నారు.