Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము
నవతెలంగాణ-అడిక్మెట్
ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ ఉపఎన్నికల డ్రామాలో భాగమేననిపీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము అన్నారు. ఆదివారం విద్యానగర్ మార్క్స్ భవన్లో పీడీఎస్యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీ నాయకుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఉద్యోగ నియామకాల భర్తీకి రాష్ట్ర కమిటీ చేపట్టే చలో కలెక్టరేట్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము మాట్లాడుతూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఖాళీలను 6 నెలల్లో భర్తీ చేసే ప్రభుత్వం ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగులు భర్తీకి చేయకపోవడంతో విద్యార్థి, నిరుద్యోగుల పట్ల కేసీఆర్ ప్రభుత్వ కపట ప్రేమ స్పష్టమవుతోందన్నారు. ఉపఎన్నికల డ్రామాల్లో భాగంగా మాత్రమే ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ల ప్రకటనలు రావడం దారుణమన్నారు. ఉద్యోగుల భర్తీపై నిర్దిష్టమైన కార్యాచరణ రచించుకున్నామన్నారు. తక్షణమే యుద్ధప్రాతిపదికన ఉద్యోగుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఉద్యోగల భర్తీకి ప్రగతిభవన్ ముట్టడి ఉంటుంది తెలియజేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్, సహాయ కార్యదర్శి సుమంత్, జానీ, మారుతి, మల్లేష్, సాయి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.