Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాగ్నిజెంట్ రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్ సహకారంతో ఐసీయూ ప్రారంభం
- ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.నాగేందర్‌తో కలిసి ప్రారంభించిన వాణిజ్య, సాంకేతిక విభాగాల ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్
నవతెలంగాణ - దూల్పేట్
కాగ్నిజెంట్, రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్ భాగస్వామ్యంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రూ.1.05 కోట్లతో 50 పడకల ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ (ఐసీయూ) వార్డును ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య, సమాచార సాంకేతిక విభాగాల ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆదివారం ఆస్పపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ నాగేందర్‌తో కలిసి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్టీ పారా మానిటర్లు, సిరంజి పంపులు, ఆటోమేటెడ్ డీఫిబ్రిలేటర్లు, ఈసీజీ మెషిన్లు, ఐసీయూలో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎమర్జెన్సీ, క్రిటికల్‌కేర్ సేవలను పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో కాగ్నిజెంట్ ప్రతిస్పందించి ఈ సౌకర్యాలు కల్పించింద న్నారు. కరోనాను ఎదుర్కొనే అన్ని సౌలతులు ఐసీయూలో ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. కొత్త ఐసీయూ వార్డు రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందన్నారు. హాస్పిటల్లో ఇప్పటికే 250 ఐసీయూ బెడ్లు ఉన్నాయని, ఇప్పుడు మరో 50 బెడ్లు వచ్చాయని అన్నారు. వీటి ఏర్పాటుకు సహకరించిన కాగ్నిజెంట్, రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్‌కు జయేశ్ రంజన్ కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంవోలు, రౌండ్ టేబుల్ ఇండియా ప్రెసిడెంట్ మోరియా ఫిలిప్, రౌండ్ టేబుల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.