Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచందర్
- జులై 27న వర్ధంతి సభ
నవతెలంగాణ-తుర్కయాంజల్
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ సేవలు మరువలేనివని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచందర్ అన్నారు. ఈనెల 27న ఇబ్రహీం పట్నంలో జరిగే మస్కునర్సింహ ప్రథమ వర్ధంతికి సుందరయ్య కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో సీపీఐ(ఎం) మహిళా శాఖా మహాసభ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్క రించి, అనంతరం మస్కు నర్సింహ వర్ధంతిసభ వాల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక రాంచందర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై భారాలు మోపుతోంద న్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇక్కడి సుందరయ్య కాలనీ నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేసిన మస్కు నర్సింహ వర్ధంతి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇ.నర్సింహ, తుర్కయంజాల్ మున్సిపల్ బాధ్యులు డి.కిషన్, పార్టీ నాయకులు టి.నర్సింహ, కె.అరుణ్ కుమార్, బి.శంకరయ్య ఐ.భాస్కర్ బి.మాల్యాద్రి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.రాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, కె.శారద ఎన్.రత్నమ్మ భారతమ్మ, సువర్ణ, జంగమ్మ, ఉప్పలమ్మ, శోభమ్మ, అనుమమ్మ తదితరులు పాల్గొన్నారు.