Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిన్‌హోల్ బ్రెయిన్ సర్జరీ విజయంతం
- వివరాలు వెల్లడించిన డాక్టర్ ష్యాహన్ సిద్ధికి
నవతెలంగాణ-బంజారాహిల్స్
సాధారణంగా ఓపెన్ బ్రెయిన్ సర్జరీ అనగానే ఎంతో మందికివెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి అసాధారణ చికిత్సను స్టార్ హాస్పిటల్ వైద్యులు ఎంతో శ్రమించి విజయవంతంగా పూర్తిచేసి ఓ నిండు ప్రాణాలను కాపాడారు. ఈసందర్భంగా ఎన్ఐఐ రేడియాలజీ, డాక్టర్ ష్యాహన్ సిద్ధికి మాట్లాడుతూ చేతి మణికట్టులో ప్రప్రథమంగా పిన్ హోల్ బ్రెయిన్ సర్జరీ దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించామన్నారు. 55 ఏండ్ల వయసున్న ఓ పేషంట్ ఊపిరి తీసుకోవడం, పక్షవాతం, ఫిట్స్, కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్పారు. చేతి మణికట్టు ద్వారా ఏర్పడిన సమస్య ఆర్టరీ ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించి రోగి సమస్యను దూరం చేశారు. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన అనంతరం రోగిని 12 గంటలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చూస్తారు. అంజియోగ్రామ్తో చిన్న వెంట్రుక మణికట్టు ద్వారా ఆర్టరీ, వీనస్ కనెక్షన్ల మధ్యలోకి ద్రవ రూపా ఏం బాలి ఏజెంట్‌ని అప్పటికప్పుడు పంపి సీల్ వేసి విజయవంతం చేశామన్నారు. ఈ వ్యాధి లక్షలో జీరో పాయింట్ 19 జీరో పాయింట్ 25 శాతం మందికి మాత్రమే ఉంటుందని చెప్పారు. రోగికి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో శస్త్ర చికిత్స నిర్వహించి దాదాపు 24/7 వారి పర్యవేక్షణలో వైద్య సేవలు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి న్యూరాలజిస్ట్, డాక్టర్ జీవి సుబ్బయ్య చౌదరి,ఇమేజింగ్ ఇంటర్వెష్ణల్ రేడియాలజీస్ట్తో అందజేస్తామన్నారు. డాక్టర్ ష్యాహన్ సిద్ధికి,ఎన్టీఆర్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. సమస్యలు ఎవరికైనా ఉన్నప్పుడు స్టార్ ఆస్పత్రికి గాని లేదాఆయనను నేరుగా సంప్రదించాల్సిన నం 7207867565.