Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్యా వ్యవస్థలో తమ అనుభవాలు, ఆలోచనలు, జ్ఞానాన్ని సమాజానికి అందించాలనే తపనతో పుస్తక రచయిత ప్రొఫెసర్ ఎండీ షఫీ అహ్మద్ కృషి అభినందనీయమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఓయూలోని సీఐపీ సెమినార్ హాల్లో గద్వాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేస్తున్న డా.ఎండీ. షఫిక్ అహ్మద్ రాసిన 'కనెక్టీవ్ మిషన్ ఆఫ్ నేషన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతి, సమాజ నిర్మాణానికి, దానిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈపుస్తకం ఎంతోగానే దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మూడు భాషల్లో ఒకేసారి తీసుకురావడం ప్రశంసనీయన్నారు. విద్యార్థులు నిత్యం చదువుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బుక్ రచయిత మాట్లాడుతూ ప్రజలతో ఎలా మమేకం కావాలో సంస్కృతి, వృత్తిపరంగా, న్యాయ, శాసన, రెవెన్యూ తదితర మొత్తం 24 అంశాలను పుస్తకంలో పొందుపరిచానని తెలిపారు. బుక్‌ను ఓయూకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డా.కె.యుగేందర్, గద్వాల ప్రభుత్వ డిగ్రీ ప్రిన్సిపాల్ శ్రీపతి నాయుడు, ఓయూ సీఐపీ డైరెక్టర్ డా.నాగేశ్వరరావు, అధ్యాపకుడు యుగంధర్, విద్యార్థులు పాల్గొన్నారు.