Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్‌ఫ్లో తగ్గడంతో రెండు గేట్లు మూసివేత
హిమాయత్‌సాగర్
హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి స్థాయి మట్టం 1762.25 అడుగులు ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2.968 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.650 టీఎంసీల నీరుంది. ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1715 క్యూసెక్కులుగా ఉంది. అయితే హిమాయత్‌సాగర్‌కు మొత్తం 17గేట్లు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో ఐదు గేట్లను తెరిచి నీటిని మూసీలోకి వదిలారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో రెండు గేట్లను మూసేశారు.
ఉస్మాన్ సాగర్
నగరానికి తాగునీటి వనరుగా ఉన్న ఉస్మాన్‌సాగర్(గండిపేట్) పూర్తిస్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 1785.80 అడుగులుగా ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.90 టీఎంసీలు కాగా ప్రస్తుత 2.971 టీఎంసీల నీటితో నిండిఉంది. ఎగువప్రాంతాల నుంచి వచ్చే ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులు మాత్రమే ఉంది. రిజర్వాయర్‌కు మొత్తం 15గేట్లు ఉన్నాయి. వరుసగా కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో రెండు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి వదిలారు. ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో ఆ రెండు గేట్లను సైతం అధికారులు మూసేశారు.