Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూమ్ సెల్లార్లో నీటి కథనంపై కదిలిన అధికారులు
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం డబుల్ బెడ్ రూములు సెల్లార్లోకి వర్షం నీరు రావడం స్విమ్మింగ్‌పూల్ మారడం, నిర్మాణ లోపాలు, నాణ్యత ప్రమాణాలు తదితర సమస్యలపై బీజేపీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనలు ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందించిన సంబంధిత అధికారులు సోమవారం డబుల్ బెడ్రూమ్ల సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు మూర్తి, కష్ణయ్య ఆధ్వర్యంలో సోమవారం డబుల్ బెడ్ రూమ్ పరిశీలనకు రావడం జరిగిందని మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ తెలిపారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి వచ్చిన అధికారులతో భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా వారిని కలవడమే కాకుండా వివిధ నిర్మాణం నాసిరకం పనులు, డబుల్ బెడ్రూమ్ సెల్లార్లోకి వర్షపు నీరు రావడంపై ఫిర్యాదు చేయడమే కాకుండా లోపాలను సరిదిద్దాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, నాసిరకం పనులు నాణ్యత ప్రమాణాలు లేకుండా చేసిన నిర్మాణ కంపెనీపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే థర్డ్ పార్టీ ఎంక్వయిరీ చేయించాలని అధికారుల దష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారి కష్ణయ్య పూర్తిగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలు విషయంలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో సెల్లార్లోకి నీళ్లు రాకుండా ఏర్పాటు చేస్తామని, అవసరమైతే నిర్మాణ పనులపై థర్డ్ పార్టీ ఎంక్వయిరీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజు, ఉపాధ్యక్షులు శివ కోటేశ్వరావు చౌదరి, కార్యదర్శి అరుణ్ రావు, లక్ష్మణ్ కార్యవర్గ సభ్యులు నరేష్‌గుప్తా, బీసీ మోర్చా అధ్యక్షులు మదన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ముఖేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు రాము, రాజీవ్ గహకల్ప కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.