Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 25 నుండి ఆగస్టు 8 వరకు ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను ముక్త కంఠంతో ఖండించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నర్సీరెడ్డి మాట్లాడుతూ రైతు కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను, లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లును ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు అమలైతే ప్రజలపైన, రైతులపైన విపరీతమైన భారాలు పడి విద్యుత్తు ఉపయోగించని పరిస్థితికి నెట్టబడతారని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తు, నేడు వైద్యం పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. కావున ప్రభుత్వ వైద్యం తగిన నిధులు కేటాయించి ఆరోగ్య రక్షణ కల్పించాలని, కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ కార్యదర్శి కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, నాయకులు కాశయ్య, వెంకటయ్య, రాములు, లక్ష్మి, రవీందర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.