Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
తెలంగాణ ప్రభుత్వం డప్పు కొట్టేవారికి, చెప్పులు కుట్టేవారికి పెన్షన్ ఇస్తామని చెప్పి 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వకుండా దళిత వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మాయ మాటలతో మోసం చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ఉన్న డప్పులతో చప్పుళ్లతో డప్పు కళాకారులతో దరువు వేసిన అనంతరం సోమవారం డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్ ధీరజ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి పిట్ట ఉపేందర్, బీజేపీ సీనియర్ నాయకులు కొత్త రవీందర్‌గౌడ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బండారి భాస్కర్, రంగారెడ్డి జిల్లా (అర్బన్) దళిత నాయకులు, యు.భాస్కర్, పంగ కష్ణ, అడ్డాల నరేష్, హయత్ నగర్ డివిజన్ ఎస్సీి మోర్చా అధ్యక్షులు గంగానే రాము, పారంద శ్రీను, యు.శక్తి సింగ్, గంగానే శ్రీను, నవీన్, బలరాం నాయక్, భరత్ నాయక్, శంకర్ నాయక్, జాన్జ నాయక్, బి.యన్.రెడ్డి, మనసురాబాద్, హయత్‌నగర్ ,వనస్థలిపురం డివిజన్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.