Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-దుండిగల్
ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఎల్లవేళల అండగా ఉండి వారి అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మేకల ఫంక్షన్ హాల్లో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుపేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి, అమలు చేస్తున్నారన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1000 మంది అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో దుండిగల్ చైర్పర్సన్ కృష్ణవేణి కృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగరాజ్ యాదవ్, వైస్ చైర్మెన్ తుడుం పద్మారావు, ఎమ్మార్వో భూపాల్, స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.-