Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- నూతన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
దేశంలోనే అత్యధికంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నూతనంగా మంజూరైన ఆహార భద్రత కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆకలితో ఉండొద్దనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నార న్నారు. అర్హులైన వారందరికీ కార్డులను అందజేస్తున్నామని, వారికి వచ్చే నెల నుంచి బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్కా వెంకట్‌రెడ్డి, మేడిపల్లి తహసీల్దారు ఏస్తేర్ అనిత, కమిషనర్లు ఎం.శ్రీనివాస్, బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు కొత్త లక్ష్మీగౌడ్, కుర్ర శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రిని అడ్డుకున్న బీజేపీ నాయకులు
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో రేషన్ కార్డుల పంపిణీలో అవకతవకలపై విచారణ జరపాలని, అదేవిధంగా ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేయనందుకు అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొ రేషన్ అధ్యక్షుడు నెమలికొండ అనిల్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి కాన్వారును అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జాయేదా బేగం, రాణి సుధాకర్, గీతారాణి, జిల్లా నాయకులు జైపాల్ రెడ్డి, రాజశేఖర్, త్రివేణి, రజిని రెడ్డి, వాసుదేవ్, రమేష్ చారి, గిరిగౌడ్, స్వరూప్ చంద్ర, మహేష్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, మమ్మిడి వెంకటేష్, నవనీత, నాగరాజు యాదవ్, అకిటి బాల్ రెడ్డి, నవీన్, అనురాధ, బకారం రాజశేఖర్, మోహన్ యాదవ్, సాయిరాం, హరీష్, జశ్వంత్ గౌడ్, సాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
నవతెలంగాణ-ఘట్కేసర్
రాష్ట్ర ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి చామకూర మాల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మెన్ పలుగుల మాదవ్‌రెడ్డి, ఎంఆర్ఓ విజయలక్ష్మి, సహకార బ్యాంకు చైర్మెన్ రామ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథóకాలు ప్రవేశపెట్టి ఎంతో మంది పేదల మనుసులో దేవుడిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్‌రెడ్డి, కొమ్మగోని రమాదేవి, బండారి అంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ, సల్లూరి నాగాజ్యోతి నర్సింగారావు, కడుపోల్ల మల్లేష్, జాంగీర్, బేతాల నర్సింగారావు, కుతాడి రవీందర్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్.కే.శౌకత్మీయా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యంపాల సూధాకర్‌రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్రావ్, శ్రీనివాస్‌రెడ్డి, చందుపట్ల ధóర్మారెడ్డి, బొక్క జంగారెడ్డి, బర్ల.దేవేందర్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.