Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, వివేకానంద నగర్ 122వ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, కూకట్పల్లి ఎమ్మార్వో గోవర్ధన్‌ల చేతుల మీదుగా డివిజన్ పరిధిలోని మొగలమ్మ కాలనీలో నూతన ఆహార భద్రత కార్డుల లబ్దిదారులకు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టి లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయడంలో నిజమైన అర్హులైన లబ్దిదారులు ఎవరనేది చూసి గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్డుల పంపిణీని ముదలుపెట్టారని, అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడతగా ఏడు వేల తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో బంగ్లాలు ఉండి, తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు ఎవరైనా ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకుంటే అవి పేదవారికి ఉపయోగపడతాయని, పేదవారికి సాయం చేయడం మనందరి బాధ్యతగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకష్ణగౌడ్, సమ్మారెడ్డి, జిల్లా గణేష్, దామోదర్‌రెడ్డి, చిన్నోళ్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, జాన్, సామ్యూల్, భాస్కర్, షౌకత్ అలీ, మున్నా, అగ్రవాసు, రాములగౌడ్, కటికరవి, ఖాజ, బాలస్వామి, జగదీష్, నాగేశ్వరరావు, మనోజ్, రవీందర్, సంపత్, సాయిగౌడ్, మహిళా నాయకులు కుమారి, మంజుల, లక్ష్మి, స్వప్న, మధులత, నిర్మలమ్మ, రేణుక, సురేఖ, దేవి, తదితరులు పాల్గొన్నారు.