Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి
- పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాన-తుర్కయాంజల్
అవినీతి కమిషనర్ షఫీఉల్లాను బదిలీ చేయాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, వినతిపత్రం అందజేశారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తా, రోకోలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల ఆధ్వర్యంలో కౌన్సిలర్ సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన తుర్కయంజాల మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షపీ ఉల్లాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెెడ్డి రంగారెడ్డిలు మాట్లడుతూ కమిషనర్ మహిళా కౌన్సిలర్ సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, ఒక దళిత కౌన్సిలర్ సభ్యురాలును అమానుషంగా కులం పేరుతో దూషించిన కమిషనర్ షఫీఉల్లా తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టామని వారు తెలిపారు. మున్సిపల్ నిధులకు సంబంధించిన లెక్కలు అడిగిన పాపానికి కౌన్సిలర్ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి, బెదిరింపులకు పాల్పడి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కమిషనర్ ఈ ప్రాంతం నుండి బదిలీ చేసి, అతను చేసిన అక్రమాలు ఉన్నతాధికారులతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, మున్సిపల్ ఉద్యోగులు కౌన్సిల్ సభ్యుల పట్ల ప్రజా ప్రాతినిద్యం చట్టంప్రకారం నడుచుకోంటు, వారి గౌరవాన్ని కాపాడాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు ప్రభుత్వం ఆదేశించినట్లు నడుచుకొంటూనే, టీఆర్ఎస్ నాయకులతో కలిసి వారి బంట్లుగా మారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ, ఇలాంటి చర్యలు మానుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం కమిషనర్ షపీ ఉల్లాపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ లు మల్ రెడ్డి అనూరాధ రాంరెడ్డి, కొత్త ఆర్తీకా, వైస్ చైైర్మన్ గుండ్లపల్లి హరితగౌడ్, కౌన్సిల్ సభ్యులు కొత్తకుర్మ మంగమ్మ, కొశిగె ఐలయ్య, రెవెల్లి హరిత, రొక్కం అనితాశేఖర్ రెడ్డి, ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మర్రి మాధవి మహేందర్ రెడ్డి, శ్రీలత అనిల్ కుమార్, ధనరాజ్, బాల్‌రాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్రెడ్డి రాంరెడ్డి, కొత్తకుర్మ శివకుమార్, పన్నాల మధుసూదన్‌రెడ్డి, బీజేపీ నాయకులు బచ్చిగళ్ళ రమేష్, ప్రేమ కుమార్, బీఎస్పీ నాయకులు వద్దిగళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.