Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహ్మ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కషి చేస్తుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ కార్పొరేషన్ లోని పెద్దబావి మల్లారెడ్డి పంక్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలంలోని బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపల్లోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ అవసరంలా మారిపోయిందన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కషి చేస్తుందన్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు, తహసీిల్దార్, శ్రీనివాస్‌రెడ్డి, మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్, జలపల్లి చైర్మెన్ అబ్దుల్లా సాదిక్, బడంగ్పేట్, మీర్పేట్ డిప్యూటీ మేయర్లు ఇబ్రమ్ శేఖర్, విక్రమ్ రెడ్డి, బడంగ్పేట్ కమిషనర్ కష్ణమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పి.శ్రీనివాస్ రెడ్డి, భీమిడి స్వప్న, జంగారెడ్డి, అర్జున్, ప్రభాకర్‌రెడ్డి, అర్.సంతోషి, శ్రీనివాస్ రెడ్డ్డి, మమత, కష్ణారెడ్డి, పవన్ యాదవ్, మనోహర్, శివ కుమార్, బాలు నాయక్, అనిత ప్రభాకర్, లలిత కష్ణ, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, లబ్డిదారులు, తదితరులు పాల్గొన్నారు.