Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
సీఎం సహాయ నిధి పేద ప్రజల పాలిట వరమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 4వవార్డులోని యు. శంకరయ్య రూ.30వేలు, ఎం.లక్ష్మిలకు రూ.50వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి వల్ల ఎంతో మంది పేద ప్రజలు లబ్దిపొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ చీర్ల రమేష్, 4వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు ఆలీ, మాజీ ఉప సర్పంచ్ నర్సింహా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మధుకర్, శ్రావణ్, మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.