Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
రాబోయే బోనాల ఉత్సవాలను పురష్కరించుకుని రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. సోమవారం డివిజన్లోని రఘునాథ్‌నగర్‌లో చేపడుతున్న రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో రోడ్లు గుంతలమయంగా మారాయని రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు చేపట్టి గుంతలను పూడ్చాలన్నారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ ముదిరాజ్, నజరు ముదిరాజ్, సూరి, రంగు ఉదరుగౌడ్, మహేష్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.