Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా కార్యదర్శి కృష్ణ అన్నారు. సోమవారం గిరిజన సంఘం, కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో కూకట్పల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం మండల తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఉపాధి హామీ చట్టంలో ఎస్సీ, ఎస్టీ, కులాల వారిగా విభజించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద పని చేసిన కూలీలకు వెంటనే పెండింగ్‌లో ఉన్న డబ్బులు చెల్లించాలన్నారు. కేంద్రం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో బీజేపీ తీసుకవస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బాలు, సుధాకర్, సీఐటీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్, గిరిజన సంఘం మండల నాయకులు మంగ్య సురేష్ పాల్గొన్నారు.