Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అధిక వర్షాలు, గోదావరి వరదలతో మండల రైతులు ప్రతి ఏడు తీవ్రంగా నష్ట పోతూనే ఉన్నారు. గత నాలుగు రోజుల క్రితం మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు, గోదావరి వరదలతో ముంచెత్తి పత్తి చేలు పలు చోట్ల దెబ్బ తిన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలలో వేసిన పత్తి చేలను గోదావరి ముంచెత్తడంతో పత్తి మొక్కల పై ఒండ్రు మట్టితో పాటు నీటి వేడికి మొక్కలు నల్లబారి పోయాయి. దీంతో పాటు అధిక వర్షాలకు పత్తి చేలలో నీటి చెమ్మతో మొక్కలు ఎర్ర బారి పోయాయి. దీంతో పాటు వరా నారుమళ్లు సైతం అధిక వర్షాలకు పలు కుళ్లి పోయి పనికి రాకుండా పోయాయి. దొరికిన కాడల్లా అప్పులు చేసి పత్తి విత్తడంతో పాటు మొక్కలు ఏపుగా పెరుగుతున్న సమయంలో ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు , గోదావరి వరదలకు తాము తీవ్రంగానే నష్ట పోయామని మండల రైతులు వాపోతున్నారు.