Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన పేదలకు 1303 కార్డులు పంపిణీ
- ఎస్సీి కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
పార్టీలకతీతంగా అభివద్ధి సాధిద్దామని అందుకు ప్రజల సమిష్టి కషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళ వారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇబ్రహీంపట్నం ఆర్డిఓ వెంకటాచారి అధ్యక్షతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం కషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 90లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో సుమారుగా 1965 మంది రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేయటం జరిగిందని, అందులో 1303 మందికి రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. వివిధ కారణాల వల్ల సుమారు 500పైగా రేషన్ కార్డులు జారీ చేయడం పెండింగ్‌లో ఉన్నాయని వారికి కూడా త్వరలోనే మంజూరు అవుతాయని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగు తుందన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా వెనుక బడిన ఎస్సీి కులాల వారికి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల లోపే రుణాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ 10లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 26.5 శాతం ఎస్సీలు ఉన్నారని ఈ పథకం ద్వారా వారం దరకి లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్, వైసీపీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సంపూర్ణ, సర్పంచులు చెరుకు కిరణ్ కుమార్, తుడుము మల్లేష్, కరిమెల వెంకటేష్, కవాడి శ్రీనివాస్ రెడ్డి, రంగయ్య, పారంద సంతోష్ కిషన్, పారిజాత శేఖర్, అంతటి యశోద ఊషయ్య, ఎర్రవెల్లి లతశ్రీ గౌరి శంకరాచారి, ముద్దం స్వరూప వీరస్వామి, జక్క లావణ్య, కౌన్సిలర్లు సిద్దంకి కష్ణారెడ్డి, పబ్బతి లక్ష్మణ్, కందాడి అనుపమ, పాశం అర్చన, ఎంపిటిసిలు సీక సాయికుమార్, గ్యార బాల లింగస్వామి, కేసెట్టి వెంకటేష్, దంతూరి అనిత మహేందర్‌గౌడ్, అర్ఐ మహేష్, కవిత, రెవెన్యూ సిబ్బంది, బాచారం ఉపసర్పంచ్ ప్రభాకర్, నాయకులు సురకంటి శ్రీనివాస్ రెడ్డి, కోట లక్ష్మారెడ్డి, పాండు, తదితరులు పాల్గొన్నారు.