Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు
- తుర్కయంజాల్ కమిషనర్ తప్పు చేస్తే నిరూపించండి
- ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్లు జైలుకే
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నవతెలంగాన-తుర్కయాంజల్
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకుపోతేనే అభివద్ధి సాధ్యమని ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మన్నెగూడలోని జెఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమని, రహస్య ఎజెండా పెట్టుకుని అధికారులపై విమర్శలు చేయడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. కాంగ్రెస్ నేతలు తమ రహస్యఎజెండా కోసం అధికారులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. తుర్కయంజాల్ కమిషనర్ షఫీయుల్లా ఏదైనా తప్పు చేస్తే నిరూపిం చాలని, అతనిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వారి సొంత ఎజండా అమలు చేయనందుకే కమిషనర్ పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కమిషనర్‌ను బదిలీ చేయమని ఆందోళనలు చేస్తే సహించేది లేదన్నారు. కమిషనర్ ఎక్కడికీ వెళ్లరని, తుర్కయంజాల్లోనే విధులు నిర్వహిస్తారని, ప్రభుత్వం తమదే ఉందన్న విషయా న్ని కాంగ్రెస్ నేతలు గ్రహించాలన్నారు. కమిషనర్‌కు చైర్మెన్‌కు మధ్య విభేదాలుంటే తనని కలిస్తే ఇరువుర్ని కూర్చోబెట్టి పరిష్కరించేవాడినని తెలిపారు. కానీ చైర్మన్ ఎప్పుడూ తనని సంప్రదించలేదని చెప్పు కొచ్చారు. అభివద్ధి పనులపై సమీక్ష నిర్వహించ డానికి ఎన్ని మార్లు చైర్మన్‌ను హాజరు కావాలని సూచించిన ఆమె హాజరుకాకపోతే తాను ఏమి చేయగలనని మంచిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో అవినీతి, అక్రమా లకిక తావు లేదన్నారు. మున్సిపల్ పాలకవర్గంలో తమదే మెజార్టీ ఉన్నదని ఇష్టారీతితో వ్యవహరిస్తా మంటే సహించేది లేదన్నారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ చైర్మన్ కందాడ ముత్యం రెడ్డి, మున్సిపల్ టీఆరెస్ ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్, కౌన్సిలర్లు సిద్దాల జ్యోతి, పుల్లగుర్రం కీర్తన, వేముల స్వాతి, తాళ్లపల్లి సంగీత, బ్యాంక్ డైరెక్టర్ సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, మున్సిపాలిటీ టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు కందాల బలదేవ రెడ్డి, యూత్ నాయకులు సురేందర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, మొహన్ గుప్త, బద్ధం వెంకట్ రెడ్డి, గుండా ధనరాజ్, వెంకటా చారి, రమెష్, వెంకటేష్ పాల్గొన్నారు.