Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
షెడ్యూలు పరిశ్రమల జీవోలను సవరించి గెజిటెడ్లో ప్రకటించాలని, కనీస వేతనం రూ.21000 ఇవ్వా లని జులై 27న జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో భాగంగా సాగర్ రింగ్ రోడ్లో ధర్నా కార్యక్రమం సీఐటీయూ ఎల్బీ నగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతనజరిగినది. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూలు ఎంప్లాయి మెంట్. ఉన్నాయి వీటిలో కనీస వేతనాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉంది ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుండి రెండు వేల పన్నెండు సంవత్సరాల మధ్య వేతనాలు సవరిం చారు. 2014 తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఏడు సంవత్సరాలు అయినా కనీస వేతనాలు జీవోలు సవరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 నుండి 15 సంవత్సరాల దాకా రాష్ట్రంలో ప్రయివేటు రంగాల్లో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు వేతనాలు పెరగ లేదు కరోనా పరిస్థితులు పెరిగిన ధరలకు ఇతర ఖర్చులు తట్టుకోలేక కార్మికుల బతుకులు రోజు రోజుకు దిన దినగండంగా మారిపోయాయని ఆయన అన్నారు. సీఐటీయూ ఎల్బి నగర్ సర్కిల్ కన్వీనర్. ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ. నిత్యావసర ధరలు, మంచి నూనె, కూరగాయలు, రైస్ రేటు విపరీతంగా పెరిగిపోవడం మూలంగా కార్మికుల జీవితాల్లో కష్టాలు వచ్చే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకోసం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రయివేటు రంగాల్లో కంపెనీల్లో పనిచేసే రోజు కూలి వారి బతుకులు కోసం ఆలోచించి చర్చించి. కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి వేతనాలు అమలు అయ్యేటట్టుగా జీవోలు జారీ చేయాలని అన్నారు.
లేనియెడల సీిఐటీయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తా మని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. ఎల్లయ్య సత్తయ్య కష్ణ వెంకటేష్. సాగర్ రింగ్ రోడ్డు దగ్గర ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.