Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీ నగర్
నాగోల్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను జవాన్ శ్రీనివాస్ దుర్భాషలాడటం దుర్మార్గం అని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు కీసర నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం హయత్‌నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్‌ను కలిసి జవాన్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కీసర నర్సిరెడ్డి మాట్లాడుతు మహిళా కార్మికులను తమ ఇంటికి రమ్మంటు, పనులు చేస్తున్న క్రమంలో వారిని ఒక పద్ధతిలో వేధిస్తున్నాడని అలాంటి చర్యలు మానుకోవాలని సీిఐటీయూ నాయకులు శ్రీనివాసుని హెచ్చరించారు. కార్మికులు డ్యూటీ దిగి పోయే సమయంలో వచ్చి సూపర్వైజర్ తోటి వారి పనిచేయమని ఒత్తిడి చేస్తు ఈ విధంగా అనేక పర్యాయాలు తమను ఇబ్బందులకు గురి చేశారని కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రీనివాసుపై ఒక మహిళ ఫిర్యాదు కేసు ఉన్నదని అయన తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధులు నిర్వహించిన అనంతరం కార్మికుల బయోమెట్రిక్ తీసుకోకుండా వేధింపులకు గురిచేయడం శోచనీయం అన్నారు. కార్మికుల సమస్యలను జీహెచ్‌ఎంసీి నాగోల్ డివిజన్ కార్పొరేటర్ దష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ రాష్ట్ర నాయకులు ఆలేటి ఎల్లయ్య ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.