Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
వార్డు అభివద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని కౌన్సిలర్ పసుల రాజేందర్ అన్నారు. సోమవారం పెద్దఅంబర్‌పేట మున్సిపల్ 6వ వార్డులో మూడు లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ పసుల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షా కాలం దష్ట్యా రోడ్లు, డ్రయినేజీ సమస్యలు ఉత్పన్నం కాకుండా అభివద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. స్థానిక సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కారం కోసం కషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో దశల వారీగా అభివద్ధి పనులు చేపడ తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ అశోక్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు, నాయకులు దాసరి నర్సింగ్ రావు, కడ్తాల అశోక్ రెడ్డి, జోర్క రవి, ముదిగొండ రమేష్, పిల్లి మహేందర్, రామస్వామి, పిల్లి రాము, కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.