Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ శివ చంద్ర, నేర విభాగపు సహాయ అధికారి భరత్ భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం మోహిద్ ఇమ్రాన్ అలియాస్ (డాన్) అనే వ్యక్తి వెల్డర్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు చోరీలకు పాల్పడుతున్నాడు. అయితే ఈనెల 23 అబిడ్స్‌లోని ఖమధ్ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఎండీ అమీర్ బంజారా హిల్స్ లోని అమ్మద్ నగర్ లోని తన నివాసం వద్ద పార్క్ చేసిన వాహనం కనబడటం లేదని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా అతని వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదేశనుసారంగా ఏసీపీ ఎం,సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటరాగేషన్‌లో ఇన్స్పెక్టర్శివ చంద్ర, నేర విభాగపు పోలీసు అధికారులు డీఐ, మొహిద్, హఫీజ్, సహాయ అధికారి భరత్ భూషణ్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, నాయక్ నిందితున్ని పట్టుకోవటంలో కీలక పాత్ర పోషించారు.