Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
వివేకానందనగర్ కాలనీ వ్యవస్థాపక సభ్యులు కీర్తిశేషులు ఎం.వి.కృష్ణారెడ్డి చేసిన సేవలు మరిచిపోలేనివని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం వివేకానందనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎం.వి.కృష్ణారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, హెటిరో డ్రగ్స్ సంస్థ చైర్మెన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డేపల్లి రాజేశ్వరరావులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎం.వి. కృష్ణారెడ్డి కాలనీ సంక్షేమం కోసం విద్యాభివృద్ధికి, సమాజానికి ఎంతగానో సేవ చేశారన్నారు. ఆయన ఆశయాలకనుగుణంగా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎం.వి.కృష్ణారెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, కూతురు హేమలత, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంత్, కార్తీక్‌రావు, కాలనీ వాసులు నర్సయ్య, దేవినేని ప్రసాద్, రాంచందర్, విజరుబాబు, జలందర్, నాని, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.