Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఏడాదిలోగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈమేరకు మంగళవారం తన కార్యాలయంలో హౌసింగ్ ఈఈ వెంకట్ దాస్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తం పూర్తి చేయాల్సిన ఇండ్ల నిర్మాణాలు ఎంతవరకు జరిగాయో తనక నివేదిక అందజేయాలని ఆదేశించారు. లోటస్ పార్క్ వద్ద మాత్రమే 70 శాతంమేర పూర్తయ్యాయని ఆఫీసర్ తెలిపారు. గురుబ్రహ్మ నగర్, దీన్దయాల్ నగర్, మస్తాన్ నగర్వంటి ప్రాంతాల్లో నిర్మాణానికి అనుకూలంగా ఉన్న నిర్మించకపోవడానిక గల కారణాలు ఏమిటో తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.