Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్ అన్నారు. మంగళవారం చార్మినార్ ఉర్దుఘర్లో డీవైఎఫ్ఐ హైదరాబాద్ సౌత్ జిల్లా రెండో మహాసభలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం అన్న మాటలు చేతలు దాటలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిందని, కానీ ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. డీవైఎఫ్ఐ మత సామరస్యాన్ని కోరుకుంటుందని ప్రజలను మనుషులుగా చూడాలన్నారు. యువతకు సామాజిక, ఆర్థిక రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహేందర్, కార్యదర్శిగా కె. కృష్ణ నాయక్. ఏడు మంది ఆఫీస్ బేరర్, 11 మందితో నూతన కమిటీని ఎన్నికయ్యారు. సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అయినాపురం రాజశేఖర్, సభ్యులు సందీప్, శ్రీను, రాజేష్, శిరీష, సంతోష్, నగేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.