Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు. మంగళవారం కాచిగూడ డివిజన్ పరిధిలోని నింబోలి అడ్డాలో రూ.18 లక్షల 70 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని, అందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం సుబ్బారాయుడు, మేనేజర్ మహేందర్, ఏఈ భావన, వివిధ పార్టీల నాయకులు డాక్టర్ శిరీష యాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, కన్నె రమేష్ యాదవ్, బద్దుల రవీందర్ యాదవ్, దిండి రాంబాబు, సునీల్, బాబ్జీ, కృష్ణా గౌడ్, బబ్లూ, శ్రీకాంత్, సతీష్, మహేందర్ యాదవ్, నర్సింహ రెడ్డి, సంతోష్ కుమార్, కష్ణా కుమార్, సుభాష్ పటేల్, క్షిర్ సాగర్, నర్సింగ్ రావు, హాజారి బాబు, రమాదేవి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.