Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులు హెచ్చరించినా పట్టించుకోని పలువురు యువకులు
- సిటీలో 60 లక్షలకు పైగా రూల్స్ ఉల్లంఘన కేసులు నమోదు
సిటీలో డైలీ 60 లక్షలకుపైగా వాహనాలు రోడ్లుపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు, నిబంధనలు పాటించకపోవడం వంటివి కూడా జరుగుతున్నాయి. కొందరు యువకులు ట్రాఫిక్ నిబంధలను బేఖాతర్ చేస్తున్నరు. వాహనాలను అడ్డదిడ్డంగా నడిపించడం, ట్రాఫిక్ సిగల్స్‌ను జంప్ చేయడం, రాంగ్ రూట్లో దూసుకెళ్లడం, హెల్మెట్, సీట్ బెల్టులు పెట్టుకోకూపోవడం వంటివి చేస్తున్నారు. మైనర్లు సైతం వాహనాలు నడిపిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
25 లక్షల కేసుల నమోదు
రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో తలకు తీవ్రగాయమై అధిక సంఖ్యలో వాహనదారులు మృతి చెందుతున్నారు. ప్రాణనష్టం జరగకుండా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలంటూ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ పెట్టుకోని కారణంగా 2020లో 20,65,722 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆర్నెల్ల కాలంలో 25,43,897 కేసులను పోలీసులు నమోదు చేశారు. గతేడాది 39,606 త్రిబుల్ రైడింగ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 52,069 కేసులు నమోదయ్యాయి. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లో గతేడాది 80,390 కేసులు నమోదు కాగా, ఈ సారీ 71,440 కేసులు నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించి 2020లో 1028, 2021లో 1338, ఇక సిగల్ జంపింగ్‌లో 2020లో 14,988 నమోదు కాగా 2021లో 24,011 నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపించిన వారిపై 2020లో 9008 కేసులు నమోదు కాగా, 2021లో 35,201 కేసులు నమోదు చేశారు.