Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఫంక్షన్ హాల్లో ఈ పథకంపై నిర్వహించిన అవగాహన సమావేశానికి కార్పొరేటర్‌తో పాటు జలమండలి అధికారులు మేనేజర్ ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీలో నివసించే నాయకులు, కాలనీ పెద్దలు ఉచిత తాగునీటి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫ్రీ వాటర్ సప్లరు స్కీమ్ కోసం ఆగస్టు 15లోపు మొబైల్ యాప్ ద్వారా ఆధార్ లింకు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కస్టమర్ కేర్ నెంబర్ 155313 కాల్ చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఆంజనేయులు, లింగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, లక్ష్మి, శ్రావణిరెడ్డి, బాబు, శివ, చంద్రమోహన్, విద్యాసాగర్, మహేశ్వర్, కొండల్ రావు, శ్రీనివాస్, సాలయ్య, మధు, యూసఫ్, సాయిబాబా, సంతోష్, చిన్న, హనుమంతు, భూషణం, జగన్ తదితరులు పాల్గొన్నారు.