Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ మురళిమోహన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కళాశాల విద్యార్థులు రాగింగ్‌కు దూరంగా ఉండాలని సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీ మోహన్ అన్నారు. మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్ నిషేధ చట్టంపై విద్యార్థినులకు అవగాహనా కార్యక్ర మం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా.పద్మావతి అధ్యక్షతన జరిగిన సదస్సులో కె.మురళీమోహన్ మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల ను వేధించడం, అవమానించడం, ఇబ్బందికి గురి చేయడం, భయం కలిగించడం, అసౌక ర్యానికి గురి చేయడం, గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం వంటి చర్యలు ర్యాగింగ్ పరిధిలోకి వస్తాయన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులకు ఆరు నెలల నుంచి ఐదేండ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందనీ, కళాశాల బహిష్కరణతోపాటు వారి భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. కళాశాలలో ర్యాగింగ్ కట్టడి చేయడం కోసం విద్యార్థులతో కమిటీలు, నిఘా ఏర్పాటు చేసి ర్యాగింగ్ జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలనీ, ర్యాగింగ్ పట్ల అలసత్వంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంట ీర్లు సురేష్, రాజు, ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.