Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-అల్వాల్
ప్రతి పేదవాడికీ రేషన్ కార్డు ఉండాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మచ్చ బొల్లారంలో ఎమ్మెల్యే మంగళవారం లబ్దిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ సంక్షేమ పథకాలు అందించటంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్య ంలో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు మధ్యలో ఉన్నాయని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో గతేడాది వర్షాకాలంలో వివిధ కాలనీల్లో వరదలో మునిగి పోయాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తుంటే ఆయా రాజకీయ నాయకులు ఏవో మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజలను అభివృద్ధి చేయడానికి మాట్లాడండి తప్పా వేరే విషయాలు మాట్లాడితే తాను సహించను అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ సరస్వతి, తహసీల్దార్ నాగమణి, డిప్యూటీ కమిషనర్ నాగమణి, ఏరియా ఇన్స్పెక్టర్ స్వర్ణలత, అల్వాల్ సర్కిల్ కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబితా అనిల్ కిషోర్, అల్వాల్ మండల రేషన్ షాప్ డీలర్లు బాల్‌రెడ్డి, వెంకట రంగారెడ్డి, క్రాంతి లాల్ శివ కుమార్, కరుణానిధి, మధుసూదన్, అరుణ్గౌడ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కొండల్‌రెడ్డి, బొబ్బిలి సురేందర్‌రెడ్డి, అనిల్ కిషోర్, నాగేశ్వరరావు, బల వంతరెడ్డి, రాజ సింహారెడ్డి, శ్రావణ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, ఢిల్లీ పరమేష్, నర్ల సురేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.