Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం సైతం మూడు నుంచి పదో తరగతి వరకు ఆన్లైన్, డిజిటల్ తరగతులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ క్లాసులు షురూవై దాదాపు 25 రోజులపైనే కావస్తోంది. జిల్లాలోని 938 ప్రభుత్వ పాఠశాలల్లో 1.21 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిడి యాదగిరి, టీషాట్, టీవీ ద్వారా 52,658, స్మార్ట్ఫోన్లు, ల్యాప్లాప్, కంప్యూటర్ల ద్వారా 22,589 మంది పాఠాలు వినేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కాగా టీ-షాట్ యాప్ను ఇప్పటివరకు 38,401 మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. 6 వేల మందికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు. 5849 మంది విద్యార్థులను అదే తరగతికి చెందిన వారితో సమన్వయం చేశారు. మరో 86 మంది కమ్యూనిటీ టీవీల ద్వారా పాఠాలు వీక్షించారు. వాస్తవానికి తరగతులు ప్రారంభమైన వారం రోజుల పాటు సగం మందే ఆన్లైన్ పాఠాలు విన్నారు. అనంతరం క్రమంగా హాజరు శాతం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 70 శాతం వరకు డిజిటల్ పాఠాలు వినేవారి సంఖ్య నమోదు అవుతుంది.
'డిజిటల్' నిరంతర పర్యవేక్షణ
ఉప విద్యాధికారులు, ఉప పర్యవేక్షణాధికారులు, క్లస్టర్స్ రీసోర్స్ పర్సన్లు నిరంతరం ఆన్లైన్ క్లాసులను పర్యవేక్షిస్తున్నారు. వీరు జిల్లాలోని 16 మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. రోజూ వారి మండల పరిధిలోని పాఠశాలలు తిరిగి డిజిటల్ క్లాసులపై నివేదికను డీఈఓకు పంపిస్తుండగా.. వారు దాన్ని రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదిస్తున్నారు.
ఆన్లైన్ క్లాసులు వినాలి
జిల్లాలోని విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులను వినాలి. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆ దిశగా చొరవ చూపాలి.
ఖనీజ్ ఫాతిమా, సెక్టోరల్ ఆఫీసర్, హైదరాబాద్