Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. మంగళవారం అంబర్‌పేట డివిజన్ నిస్యూపటేల్నగర్ కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్లు ఇ.విజరు కుమార్‌గౌడ్, పద్మవెంకటరెడ్డిలతో కలిసి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. పేదల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సంక్షేమ ఫలాలను అందజేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో 1351 కార్డులు మంజూరయ్యాయని చెప్పారు. రేషన్ కార్డుల కోసం 938 1327010 నెంబర్లో సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తుఖ్యానాయక్, హరికష్ణ, సంతోష్, నసీరుద్దీన్, పద్వి, రాకేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు లవంగు ఆంజనేయులు, ఎర్రబోలు నర్సింహారెడ్డి, రామారావుయాదవ్. సిద్ధార్డ్ ముదిరాజ్, రాగుల ప్రవీణ్‌పటేల్, దయాకర్, జాకీబాబు, మహేష్ ముదిరాజ్, మల్లిఖార్జున్యాదవ్, ఎండి గౌస్. సువిత. శ్రీనివాస్, వంజరి నాగరాజు, విషవర్ధన్, రంగు ఉదరుగౌడ్, భావాణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.