Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తులన్నీ అమ్మినా నయం కాని మాయదారి జబ్బు
- అపన్నహస్తం కోసం ఎదురు చూపులు
పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (పీఎస్‌హెచ్) వ్యాధితో బాధపడుతున్న యువతి ప్రాణా లు నిలిపేందుకు శాశ్వత రోగ విముక్తి కోసం బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె తండ్రి బాల్‌రెడ్డి తమ కుమార్తె చికిత్స కోసం ఇప్పటికే రూ.10 లక్షలు అప్పు చేశాడు. అయినా యువతి ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, అందుకు రూ.30లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఏం చేయాలో తెలియక దిగాలు పడుతున్నాడు. దయా హదయంతో దాతలు స్పందించి సహాయం చేస్తే తన కుమార్తె ప్రాణాలు దక్కుతాయని దీనంగా వేడుకుంటున్నాడు.
నవతెలంగాణ-బోడుప్పల్
మహబూబ్ నగర్ జిల్లా రెవల్లెకు చెందిన ఎం.బాల్‌రెడ్డి, శశికళ దంపతులు గత 20 ఏళ్ల క్రితం వలసవచ్చి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విష్ణుపురి ఎన్‌క్లేవ్‌లో నివాస ముంటున్నారు. ప్రయివేటు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు కుమార్తెలను పోషిస్తు న్నాడు బాల్‌రెడ్డి. ఇటీవల అనేక కష్టాలకు ఓర్చి పెద్ద కుమార్తెకు పెళ్లిచేసి అత్తారింటికి పంపాడు. ఇంత లోనే బాల్‌రెడ్డి కుటుంబానికి పెద్ద కష్టమొచ్చి పడిం ది. రెండో కుమార్తె శివాని (24) నాలుగేళ్ల క్రితం అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం సిటీలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయిం చారు. ఆమెకు పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లో బినురియా (పీఎన్హబ్) అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటినుంచి తరచూ ఆసు పత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తు న్నారు. ఇటీవల శివాని ఆరోగ్యం మరింత విషమిం చడం తో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించగా దాదాపు రూ.10 లక్షల దాకా ఖర్చయ్యింది.
బోస్మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలంటున్న డాక్టర్లు
క్యాబ్ డ్రైవర్ అయిన బాల్‌రెడ్డి తన శక్తిమేర ఎంత ప్రయత్నించినా శివాని ఆరోగ్య పరిస్థితిలో ఎటు వంటి మార్పు కనిపించకపోవడంతో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, అందుకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో తీవ్రంగా కుంగిపోయిన అతను కుటుంబసభ్యులు అంత డబ్బును ఏ విధంగా సమకూర్చాలో తెలియక ఆందోళన చెందుతు న్నారు. ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిలేక ఆర్థికంగా చితికిపోయి కుటుంబం గడవడానికే ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెద్ద కుమార్తె ఆర్థికంగా కొంత ఆసరాగా నిలవడంతో ఇల్లు గడుస్తోందని, ఇప్పుడు రెండో కుమార్తె ప్రాణాలు దక్కించుకునేందుకు అంత డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక బాల్‌రెడ్డి మదనపడుతున్నాడు. తమ కుటుంబం నిస్సహాయ స్థితిని గుర్తించి తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సహాయం అందించి దాతలు సహకరిం చాలని వేడుకుంటున్నాడు. దయా హదయంతో తమకు తోచిన సహాయాన్ని అందించి తమ కూతురికి ప్రాణభిక్ష పెట్టాలని బాల్రెడ్డ్డిి కుటుంబం అర్థిస్తోంది. ఆర్థిక సహాయం చేసే దాతలు గూగుల్ పే - 89789 48336, ఫోన్ పే - 7032912411 ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ నెం.434701502203, ఐసీఐసీఐ (మాదాపూర్ బ్రాంచ్), ఐఎఫ్ఎస్సీ ఐసీఐసీ0004347లో జమ చేయాలని కోరారు. ఇతర వివరాల కోసం సెల్‌ఫోన్ నెం.99490 28787 నెంబరు సంప్రదించాలని బాల్ రెడ్డి వేడుకున్నారు.