Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా బీజేెవైఎం జనరల్ సెక్రటరీ మారం శ్రీధర్
నవతెలంగాణ-హస్తినాపురం
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం డివిజన్లో సామాన్య ప్రజలపై జీహెచ్ఎంసీ అధి కారులు తమ ప్రతాపాన్ని చూపెడుతూ అక్రమంగ నిర్మించారని వారు నివసిస్తున్న ఇళ్లను ఏ మాత్రం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం దుర్మార్గమని రంగారెడ్డి జిల్లా బీజేవైఎం జనరల్ సెక్రటరీ మారం శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నియోజకవర్గ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీి ప్రభుత్వ అధికారులు మాత్రం సామాన్య జనాలపై విరుచుకుపదుతున్నారని, నియోజక వర్గంలో ఎంత మందికి కమర్షియల్ బిల్డింగ్స్‌కు పర్మిషన్లు ఉన్నాయిని, పెట్టుబడిదారులకు కమర్షియల్ బిల్డింగ్స్ వారికి ఒక న్యాయం సామాన్య ప్రజానీకానికి ఒక న్యాయమా అని వారు జీహెచ్ ఎంసి అధికారులను నిలదీశారు. జీహెచ్ఎంసి టీపీఓ అధికారులు వారు బీ.ఆర్.ఎస్ పర్మిషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి చివరకు వారి ఇళ్లను పోలీస్ టాస్క్ ఫోర్స్‌తో వచ్చి కూల్చివేయడం పట్ల ప్రభుత్వ అధికారులు బడా వ్యాపారవేత్తలకు, కొంతమంది రాజకీయ నాయకులకు అండగా ఉండటం ఎంత వరకు సమంజసమని, నియోజక వర్గ పరిధిలోని కమర్షియల్ బిల్డింగ్ యజమానుల పైన కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి సామాన్య ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని మారం శ్రీధర్ అన్నారు.