Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
మున్సిపల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 50శాతం స్థానికులకు ఇవ్వాలని సీపీఐ(ఎం) నాయకులు చింతల యాదయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భం గా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని మైసమ్మ గుట్టలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను బుధవారం ఆయన సందర్శించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపల్లో నిర్మించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 50 శాతం స్థానిక ప్రజలకు ఇవ్వాలని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల పనులు లేక అనేక ఇబ్బందు లకు గురై పేద ప్రజలు ఇంటి కిరాయి కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వెంటనే ప్రభుత్వం స్పం దించి ఇండ్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పోచయ్య, శేషు, నాగారాజు, శివ, మారప్పు, తదితరులు పాల్గొన్నారు.