Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి భౌతికంగా తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్ మూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో రామంతపూర్‌లోని చైతన్య పాఠశాల విద్యార్థులతో భౌతికంగా తరగతి గదులను నిర్వహించడం జరుగుతుంది, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఏ ఒక్క విద్యా సంస్థ కూడా నడవదు అని ప్రభుత్వం చెప్తే, చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలు కరోనా నిబంధనలు వర్తించవని విద్యార్థుల ప్రాణాల కంటే మాకు ఫీజులే ముద్దు అని చైతన్య విద్యా సంస్థ రామంతపూర్‌లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు వరకు భౌతికంగా షిఫ్టుల వారీగా డే బై డేగా నిర్వహిస్తుంది. ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేరు. తాత్కాలికంగా కంటి తుడుపు చర్యగా ఎంఈఓ శశిధర్రావు యాజమాన్యా నికి వత్తాసు పలికారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇలా అమ్ముడుపోతే ప్రజలకు, తల్లిదండ్రులకు సమాధానం ఎవరు చెప్తారు అని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిలదీస్తుంటే ఎమ్ఈఓ కంటితుడుపు చర్యగాసమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి :
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ మాట్లాడుతూ... ప్రభుత్వ అనుమతి లేకుండా భౌతికంగా క్లాసులు నిర్వహించడం వలన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కేవలం చైతన్య మాత్రమే భౌతిక క్లాసులు చెబుతూ ర్యాంకులు వస్తున్నారు అనే పేరుతో ఫీజులు రెండింతలు వసూలు చేసే కార్యక్ర మంలో చైతన్య పాఠశాల యాజమాన్యం అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నంతకాలం కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం అధికారులు ఇకనైనా నిద్ర లేవాలని, లేకపోతే భౌతిక దాడులకు దిగుతామని ఆ దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ ఉప్పల్ మండల కార్యదర్శి మణికంఠ, నాయకులు కాశీ, చందన శివ, శ్రీను, విష్ణు పాల్గొన్నారు.