Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్ నగర్1డిపోలో హెవీ డ్రైవింగ్ స్కూల్ శిక్షణ కేంద్రం ఏర్పాటు అభినంద నీయమని హైదరాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న అన్నారు. బుధవారం హయత్ నగర్లో ఉన్న డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల్లో ఆర్టీసీి పట్ల ఉన్న ఆదరణను, నమ్మకాన్ని దష్టిలో పెట్టుకుని ఒక నైపుణ్యత కలిగిన శిక్షకులచే ఆర్టీసీ వారే సొంతంగా డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి ఒక సంవత్సరంపాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగిఉన్న వారిని శిక్షణకు అనుమతి ఇస్తాం అన్నారు. అలాగే శిక్షణ రుసుము రూ.15,600లుగా వీటితోపాటు డ్రైవింగ్ లైసెన్సు ఇప్పించడంలో కూడా ఆర్టీసీ తరుపున సహాయం చేస్తాం అని తెలిపారు. లైసెన్స్ కు సంబంధించిన అంశాలను తరువాత తెలియజేస్తామన్నారు. భావితరాల వారికి నైపుణ్యత, నాణ్యతతోపాటు డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పించి వారిని ఉత్తమ డ్రైవర్లుగా తీర్చిదిద్దడంలో ఆర్టీసీవారు ఒక అడుగు ముందుకు వేయడం జరిగిందని, ఈ రోజుల్లో డ్రైవింగ్ అనేది చాలా కష్టం, ఇలాంటి సమయంలో ఆర్టీసీ వారు ఒక నూతన ప్రయోగాన్ని చేపట్టడం శుభ సూచకం అన్నారు. ఈ అవకాశాన్ని కార్గోపార్సిల్ ఎలా నడుస్తున్నాయో ఈ డ్రైవింగ్ శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇట్టి మంచి కార్యక్రమంను ఆయా డిపో మేనేజర్లు వారి వారి పరిధిలోని గ్రామాల్లో నిరుద్యోగ యువతకు, ఆసక్తి గల యువతీ, యువకులకు తెలిసేవిధంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్, కాచిగూడ, చార్మినార్ల డివిజన్ మేనేజర్లు విజయభాను, అపర్ణ కల్యాణి, రాములు, డివిజన్లో గల డిపో మేనేజర్లు, అధికారులు, డివిజన్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, డిపో మేనేజర్ రఘు, శ్రీనివాస్, రమాదేవి డ్రైవింగ్ ట్రయినర్ సాయిద్, నరేష్ పాల్గొన్నారు.