Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
జీహెచ్ఎంసీిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, సిబ్బందికి వెంటనే వేతనాలు పెంచాలని సీఐటియు నాయకులు డిమాండ్ చేశారు. జూన్ నెల నుండి పెరిగిన వేతనాలను కేటగిరీల వారీగా అమలు చేయాలని సీఐటియు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జీహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు సీిఐటియు ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ మాట్లా డుతూ జీవో నెంబర్ 60ను సవరించి మున్సిపల్లో పనిచేస్తున్న పారిశుధ్యం, వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఆఫీస్ నిర్వహణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనం కేటగిరీల వారీగా 19వేల నుండి 22 వేలకు, 9వేల నుండి 31వేలకు పెంచాలని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక మున్సి పాలిటీలలో ప్రమాదంలో కార్మికులు మరణిస్తున్నారని, వారికి రూ.25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. వయసు మీరిన కార్మికులను తొలగిస్తే వారి వారసులకు కుటుం బంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆ కుటుంబానికి 10లక్షల రూపాయలు ఇవ్వాలని సీఐటియు డిమాండ్ చేసింది. మరణించిన కార్మికులకు దహనసంస్కారాలకు 30వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. పారిశుధ్య కార్మికుల పిల్లలకు ప్రత్యేక స్కాలర్షిప్పులు, ఉన్నత చదువులకు ప్రోత్సాహం కల్పించాలని, గ్రూప్ వన్ గ్రూప్ ప్రవేశపరీక్షల వసతి కల్పించాలని, భోజనం లాంటి ఉచిత సౌకర్యాలు కల్పించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రం జోనల్ కార్యాల యంలో జోనల్ కమిషనర్‌కు ఇవ్వడం జరిగినది. సీఐటీియు జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, సీఐటీియు ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, మున్ని, అలివేలు విమల శ్యామల స్వరూప యాదమ్మ వనజ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.