Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 500 మందికి పైగా స్థానిక ప్రజలు, జాతీయ సమన్వయకర్త, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అండ్ ఛైర్మెన్ సోషల్ మీడియా తెలంగాణ కాంగ్రెస్ దీపక్ జాన్ ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్లోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. కేసీఆర్ నేతత్వంలోని టీఆర్ఎస్ వాగ్ధానం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 300 మందికి పైగా పేద ప్రజల చేసుకున్న దరఖాస్తుల పరిస్థితి, ఇండ్ల పురోగతిపై ప్రశ్నించారు. 6 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని, మీసేవలో డబ్బు కూడా చెల్లించారు కానీ ఇప్పటి వరకు వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 300 ఇండ్లు కట్టి ఇచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే పేర్కొంటున్నారు, కానీ దురదష్టవశాత్తు, అర్హతగల పేదలలో ఎవరికీ డబల్ ఇల్లు దక్కలేదని ఆరోపించారు. అధికార పార్టీ తప్పుడు వాదనలతో ప్రజలను మభ్యపెట్టి, మోసగిస్తోందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని అని చెప్పారు. కార్యక్రమంలో బ్రహ్మాజీ, కిశోర్ యాదవ్, కిరణ్, వాజిద్, అభిషేక్, సాయి మధుకర్, అల్లం సునీల్, రాంలీలా, ప్రభాకర్, మహేష్ గౌడ్, నరసింహ ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.